సూర్య 44 ఫస్ట్ షాట్ రిలీజ్

suriya 44 movie first shot released

తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో.. బాబి డియోల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనితో పాటు సూర్య 44వ సినిమా కూడా చేస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి వరుస అప్ డేట్లు ఇస్తున్నాడు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. తాజాగా మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి ఫస్ట్ షాట్ అంటూ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో హీరో సూర్యను చూపించారు. ఓ సముద్ర తీరాన కూర్చున్న హీరో ఏదో ఆలోచిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. బ్యాక్​గ్రౌండ్​లో ఇచ్చిన మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.

కాగా మలయాళం నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈసినిమాను స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్‌తో కలిసి సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీగా నిర్మిస్తుంది. సంతోష్‌నారాయణ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.