కుబేర భారీ యాక్షన్ సీక్వెన్స్ లో ధనుష్, నాగార్జున

kubera movie major action schedule begins

ఎప్పుడూ కూల్ సినిమాలతో వచ్చే శేఖర్ కమ్ముల ఈసారి డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కుబేర. ఈసినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు వచ్చాయి. ధనుష్‌, నాగార్జునల ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను ఇప్పటికే విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈసినిమా కొత్త షెడ్యూల్ ను హైద్రాబాద్ లో స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక్కడ ఈ సినిమాకోసం వేసిన భారీ సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాలను తీస్తున్నాడు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ధనుష్‌, నాగార్జున ఇద్దరూ పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.