తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత అగ్ర నటుడు నందమూరి తారక రామారావుకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించడం సముచిత గౌరవంగా ఉంటుందని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే తెలుగు ప్రజలందరి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నేడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఇక ఇటీవలే చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ అవార్డును అందించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























