యంగ్ హీరో నిఖిల్ మాత్రం ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో హీరోయిన్ ఈసినిమాలో భాగమవుతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. నభా నటేష్ ఈసినిమాలో నటించనున్నట్టు తెలియచేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్వయంభు సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియోని రిలీజ్ చేస్తూ టీంలోకి స్వాగతం చెప్పారు. పీరియాడిక్ గెటప్ లో ఉన్న నభా పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందిస్తుండగా. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఎం.ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: