గామి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ 

gaami will be streaming on zee5telugu from april 12th

విశ్వక్ సేన్ గామి ఓటీటీలోకి వచ్చేస్తుంది.జీ 5 ఈసినిమాను తెలుగు తోపాటు కన్నడ,తమిళ భాషల్లో ఈనెల 12నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానున్నట్లు వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.ఇక ఈసినిమా గత నెలలో థియేటర్లలోకి వచ్చి దాదాపు 25కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి  హిట్ అనిపించుకుంది.విద్యాసాగర్ కాగిత డైరెక్ట్ చేసిన ఈసినిమాలో విజువల్స్ ఆకట్టుకున్నాయి.చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా యూవీ సెల్ల్యులాయిడ్ ఈసినిమాను విడుదలచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వరస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు విశ్వక్.అందులో భాగంగా ప్రస్తుతం గ్యాంగ్స్ అఫ్ గోదావరిలోపూర్తి చేసే పనిలో వున్నాడు.వచ్చే నెల17న విడుదలకానుంది.ఇప్పటివరకు విడుదలచేసిన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.కృష్ణ చైతన్య తెరకెక్కిస్తుండగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

ఈసినిమాతో పాటువిశ్వక్,మెకానిక్ రాఖీ సినిమాలో నటిస్తున్నాడు.రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఇవి కాకుండా ఈ హీరో రీసెంట్ గా మరో సినిమాకు కమిట్ అయ్యాడు.షైన్ స్క్రీన్ నిర్మాణంలో లైలా అనే సినిమాలో నటించనున్నాడు విశ్వక్.ఇందులో లేడీ గెటప్ లో కనిపించనున్నాడు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =