ఫ్యామిలీ స్టార్ మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

vijay deverakonda family star movie interesting elements

గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇక మరికొద్ది గంటల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమా చూడటానికి ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిట్ కాంబినేషన్
పరుశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేేషన్ లో వచ్చిన సినిమా గీతా గోవిందం. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందే తెలిసిందే. ఈసినిమా విజయ్ కెరీర్ లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాగానే నిలుస్తుంది. అలాంటి హిట్ కాంబినేషన్ లో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా వస్తుంది. దీంతో సినిమాపై మొదటి నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

విజయ్ దేవరకొండ-మృణాల్ కాంబినేషన్
ఈసినిమాపై ఇంట్రెస్ట్ పెరగడానికి మరో ప్రధానమైన కారణం విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ కాంబినేేషన్ కూడా ఒకటి. సినిమాను ప్రకటించినప్పుడే వీరిద్దరి కాంబినేషన్ పై మంచి బజ్ ఏర్పడింది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో మృణాల్ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు మృణాల్ స్టోరీ సెలక్షన్ కూడా బాగుంటుంది అన్న పేరును సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ బట్టి చూస్తే విజయ్-మృణాల్ కెమిస్ట్రీ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యేలా కనిపిస్తుంది.

ప్రొడక్షన్ హౌస్
ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా.. విజయ్ దేవరకొండ హీరోగా సినిమా కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా దిల్ రాజు తో సినిమా చేయాలని ఎప్పటినుండో చూస్తున్నానని ఈసినిమా ప్రమోషన్స్ లోనే చాలా సార్లు తెలియచేశాడు. ఫైనల్లీ ఫ్యామిలీ స్టార్ తో అది నెరవేరుతుంది. ఇక దిల్ రాజు నుండి సినిమా వస్తుందంటే అది మినిమం గ్యారెంటీ అన్న టాక్ ఉంది కాబట్టి ఈసినిమాపై కూడా హిట్ కొడుతుందన్న అభిప్రాయాలు అప్పుడే మొదలయ్యాయి.

కథ
రిలీజ్ అయిన అప్ డేట్లను బట్టి ఫ్యామిలీ స్టార్ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఉండే సమస్యలను తెలియచేస్తూనే.. అటు ప్రేమను మరోవైపు ఎమోషన్ ను కలిపి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీసుకొస్తున్నారు. మరోసారి పాత విజయ్ ను బయటకు తీసుకురానున్నాడు. తన నటనతో, కామెడీ టైమింగ్ తో అలరించేలా కనిపిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 3 =