గత వారం రిలీజైన ఓం భీమ్ బుష్ 25కోట్ల క్లబ్ లో చేరింది.మాత్ టాక్ బాగుండడం తో ఐపీఎల్ ప్రభావం తట్టుకొని ఈ మార్క్ ను చేరుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో ఈసినిమా 25.20కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.ఈ వారాంతంలో టార్గెట్ ను రీచ్ కానుంది.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మరో సినిమాను నుండి పోటీ లేకపోవడం ఓం భీం బుష్ కు కలిసొచ్చింది.అయితే రేపటి నుండి మాత్రం గట్టి పోటీ ఎదురుకానుంది.రేపు మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ విడుదలవుతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండడంతో భారీ పోటీ ఉండనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక శ్రీ విష్ణు ఓం భీం బుష్ తో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు.గత ఏడాది సామజవరగమన అంటూ సైలెంట్ గా వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.అయితే ఓం భీం బుష్ ఫుల్ రన్ లో ఆసినిమా కలెక్షన్స్ ను క్రాస్ చేయడం కష్టమే.
ఇదిలావుంటే సూపర్ ఫామ్ లో వున్న శ్రీ విష్ణు వరస సినిమాలకు కమిట్ అవుతున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం రాజా రాజా చోర డైరెక్టర్ తో స్వాగ్ అనే సినిమా చేస్తున్నాడు.ఇది కాకుండా గీతా ఆర్ట్స్ లో ఓ సినిమాను అలాగే కోనవెంకట్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.వీటితోపాటు ఓ హారర్ థ్రిల్లర్ కు కూడా సైన్ చేశాడట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: