ఆర్ సి 16 అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు 

buchi babu says three song compositions finished for rc 16

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా కాంబినేషన్ లో ఆర్ సి 16 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనుందని తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు.ఈక్రేజీ కాంబినేషన్ పై అంచనాలు భారీ గా వున్నాయి.ఇక నిన్న రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్ ఈవెంట్ లో డైరెక్టర్ బుచ్చి బాబు ఈసినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు.మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఈసినిమా కోసం ఇప్పటివరకు మూడు పాటలు కంపోజ్ చేశారని అవి సూపర్ గా వచ్చాయని ఉప్పెన లో సాంగ్స్ కంటే మించి వుండనున్నాయని బుచ్చి బాబు అన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించనుండగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ను ఓ పవర్ ఫుల్ రోల్ కోసం తీసుకున్నారు.మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ సినిమా నిర్మిస్తుంది.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు.మరో రెండు నెలల్లో ఈసినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఆతరువాత చరణ్ తన 16వ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

ఈసినిమా తరువాత రామ్ చరణ్ తన 17వసినిమా సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడు.ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన రంగస్థలం బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిల్చింది.దాంతో ఈ 17వ సినిమాపై అంచనాలు మాములుగా లేవు.ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =