సిద్ధు పెద్ద హీరో అవుతాడని అప్పుడే చెప్పాను – డైరెక్టర్ బాబీ

Director Bobby Praises Siddhu Jonnalagadda at Tillu Square Pre Release Event

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన నటించిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘డీజే టిల్లు’కి మించిన వినోదాన్ని అందించడానికి ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ కొల్లి, బొమ్మరిల్లు భాస్కర్, వెంకీ అట్లూరి, నీరజ కోన ముఖ్య అతిథులుగా హాజరై ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇక సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక అభిమానుల కోలాహలం నడుమ ఆద్యంతం ఆహ్లదకరంగా సాగింది. నటీనటులు మురళీధర్, ఆంథోనీ, సుజాత, సంగీత దర్శకులు రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో, గీత రచయిత కాసర్ల శ్యామ్, సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్, ఎడిటర్ నవీన్ నూలి, గాయకుడు శ్రీరామ్ చంద్ర, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా బాగుంది. సిద్ధుతో నాకో స్పెషల్ మూమెంట్ ఉంది. 2015లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సమయంలో ఒక సాంగ్ ట్యూన్ కోసం దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరకు వెళ్ళి వస్తూ ఉన్నాను. అప్పుడు అనుకోకుండా ఇంగ్లీష్ మ్యాగజైన్ తిరగేస్తే సిద్ధుది ఒక చిన్న ఫొటో చూశాను. ఈ అబ్బాయి ఎవరు చాలా బాగున్నాడు అని మా కో డైరెక్టర్‌కి చెప్పి.. ఆఫీస్‌కి పిలిపించాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో ఏదైనా మంచి పాత్ర ఉంటుంది అనుకొని సిద్ధు వచ్చాడు. కానీ సిద్ధుని చూడగానే భవిష్యత్‌లో ఇతను ఎక్కడికో వెళ్తాడు అని అనిపించింది” అని గుర్తుచేసుకున్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అప్పుడు సిద్ధుతో.. ఈ సినిమాలో వేషం ఇవ్వడం కోసం నిన్ను పిలవలేదు, నువ్వు ఖచ్చితంగా పెద్ద హీరో అవుతావు అని చెప్పాను. ‘డీజే టిల్లు’ తర్వాత ఒక వేడుకలో కలిస్తే.. సిద్ధునే ఈ విషయాన్ని నాకు గుర్తు చేశాడు. అందరూ అంటున్నట్టు సిద్ధు ఎనర్జీ మైండ్ బ్లోయింగ్. పిల్లల్లో కూడా సిద్ధుకి అభిమానులు ఉన్నారు. సీక్వెల్ ట్రైలర్ చూస్తే.. ‘డీజే టిల్లు’ కంటే డబుల్ ఎనర్జీ ఉంది. నిర్మాత నాగవంశీ గారు కూడా మా బాలయ్య బాబు గారి ‘NBK 109’ షూటింగ్ సమయంలో ఈ సినిమా గురించి చాలాసార్లు చెప్పారు. దర్శకుడు రామ్ మల్లిక్‌ గారికి, టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అని తెలిపారు బాబీ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =