తెలుగు ఆడియన్స్ గురించి వరదరాజ మన్నార్

prudhvi raj sukumaran about telugu audience

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి రాబోతున్న సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. మార్చి 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్, ట్రైలర్ లను విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తెలుగు ఆడియన్స్ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నెటిజన్ తన ట్విట్టర్ ద్వారా ఆడు జీవితం సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా ప్రమోట్ చేయండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీనికి పృథ్వీ సుకుమారన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తప్పకుండా ప్రమోట్ చేస్తాం.. తెలుగు, కన్నడ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్..22, 24న హైద్రాబాద్, కన్నడలో ప్రమోషన్స్ చేస్తున్నాం.. తెలుగు, కన్నడ సెన్సార్ కోసం వెయిట్ చేస్తున్నాం.. అది అయిపోయిన తరువాత బుకింగ్స్ ను ఓపెన్ చేస్తామని తెలిపారు.

కాగా ఈసినిమాలో అమలాపాల్, కేఆర్ గోకుల్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఏఆర్. రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు తెలుగులో రిలీజ్ చేస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + three =