సలార్ 2 సీజ్ ఫైర్ కు మించి వుండనుందట 

More action will be add on Shouryaanga Parvam says Prithviraj Sukumaran

గత ఏడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్.బాహుబలి 2ని బ్రేక్ చేయలేకపోయింది కానీ ప్రభాస్ కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక సలార్  సెకండ్ పార్ట్  శౌర్యంగ పర్వం రానుందని తెలిసిందే.ఫస్ట్ పార్ట్ స్నేహం నేపథ్యంలో తెరకెక్కగా సెకండ్ పార్ట్ లో ఆ  స్నేహితులే శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో చూపెట్టనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీజ్ ఫైర్ లో యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రభాస్ కటౌట్ కు తగ్గట్లు  ఫైట్స్ ను డిజైన్ చేయించి  ఎలివేషన్ సీన్ల తో  ఫ్యాన్స్ చేత శభాష్ అనిపించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక సెకండ్ పార్ట్ లో అంతకుమించిన ఎలివేషన్ సీన్స్ అలాగే యాక్షన్  వుండనుందట.ఈవిషయాన్ని సలార్ లో  వరదరాజ మన్నార్ గా నటించిన పృథీరాజ్ సుకుమారన్ వెల్లడించాడు.ప్రస్తుతం అతను  ఆడు జీవితం అనే సినిమా ప్రమోషన్స్ లో  బిజీగా వున్నాడు.ఈనెల 28న ఈసినిమా విడుదలకానుంది. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లలో  పృథ్వీరాజ్ఎ కు క్కువగా  సలార్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇక సలార్ 2 వచ్చే  నెల నుండి సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వుంది. అటు ప్రభాస్ ఏమో వరస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. మరి ఈసినిమా షూటింగ్ లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =