కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన ‘సింగం’ సిరీస్ కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సూర్య 42వ ప్రాజెక్ట్‌గా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ‘కంగువ’ నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ వీడియో, పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ‘కంగువ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఈ మూవీ టీజర్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వారు అధికారికంగా ప్రకటించారు.
Prepare for a phenomenon!#Kanguva set to ignite your personal screens🔥
A Sizzle Teaser dropping tomorrow, at 4:30 PM#KanguvaSizzle 🦅@Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @PenMovies @NehaGnanavel…
— Studio Green (@StudioGreen2) March 18, 2024
1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుండగా.. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో విడుదల కానుంది. ఇక ఇటీవలే కంగువ షూటింగ్ పూర్తి చేసుకున్న సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్లో ‘సూర్య 43’లో నటించడానికి సిద్ధమయ్యారు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: