ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ‘యాత్ర 2’ నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. యాత్ర 2 నుండి సెకండ్ సింగిల్ రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హీరో జీవా సోమవారం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘తొలి సమరం’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్‌ను మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను చిత్ర బృందం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి తొలి లిరికల్ వీడియో సాంగ్ ‘చూడు నాన’ను విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చగా.. ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
#TholiSamaram ~ A leader’s fight for his people! ✊#Yatra2 Second Single will be out tomorrow @ 11:00 AM! 🤩
A @Music_Santhosh Musical 🎹#LegacyLivesOn #Yatra2OnFeb8th @mammukka @JiivaOfficial @ShivaMeka @ramjowrites @gowthambharadwj @MahiVraghav @madhie1 #SelvaKumar… pic.twitter.com/l83Ubb0LpX
— Jiiva (@JiivaOfficial) January 29, 2024
కాగా ‘యాత్ర 2’లో ప్రధానంగా సీఎం జగన్ రాజకీయ రంగప్రవేశం, అందుకు దారి తీసిన పరిస్థితులు, సొంతంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించడం, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడం.. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వంటివాటిని చూపించనున్నారు. ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: