ఊరు పేరు భైరవ కోన రిలీజ్ డేట్ మళ్లీ మారింది

ooru peru bhairavakona movie release date postponed again

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను పలు పాటు రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ఈగల్, లాల్ సలామ్ సినిమాలు ఫిబ్రవరి 9వ తేదీకి షిఫ్ట్ అయ్యాయి. దీంతో ఈసినిమా వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. కానీ అదేం లేదు అని మేకర్స్ చెప్పారు. కానీ ఫైనల్ గా ఇప్పుడు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈసినిమా రిలీజ్ ను మరో వారం రోజులు వెనక్కి పంపారు. ఫిబ్రవరి 16వ తేదీకి ఈసినిమాను వాయిదా వేశారు.

కాగా టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + seventeen =