మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు మోహన్ లాల్. అందులో పృథ్విరాజ్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఎంపురాన్ 2 అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా లూసిఫర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా.. లూసిఫర్ కి సీక్వెల్ గా ఎల్2ఇ: ఎంపురాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ తో బిజీగా ఉంది. అక్టోబర్ లో ఈసినిమా షూటింగ్ ను మొదలవ్వగా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈనేపథ్యంలోనో గత కొద్ది రోజులుగా యూకే షెడ్యూల్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్. యూకే సెకండ్ షెడ్యూల్ పూర్తయిందని తెలుపుతూ తన వర్కింగ్ స్టిల్ ను పోస్ట్ చేశాడు పృథ్వీరాజ్.
#L2E End of Schedule 2! 🇬🇧 pic.twitter.com/oNga1m2vNw
— Prithviraj Sukumaran (@PrithviOfficial) January 21, 2024
ఇంకా ఈసినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. మంజువారియర్ కూడా మరో కీలకపాత్రలో నటిస్తుంది. ఆశీర్వాద్ సినిమాస్ తో పాటు లైకా ప్రొడక్షన్స్ కూడా ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: