గుంటూరు కారం 10 డేస్ కలెక్షన్స్

Guntur Kaaram Collects 231 Cr Gross Worldwide in 10 Days

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ‘గురూజీ’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్‍ ముందే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అనూహ్యంగా తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే సూపర్ స్టార్ క్రేజ్ గుంటూరు కారం సినిమాను రేసులో నిలబెట్టింది. దీనికితోడు పండగ సీజన్ కావడం, ఫ్యామిలీ సెక్షన్ ఆడియెన్స్‌కి కూడా మూవీ నచ్చడంతో సక్సెస్ బాట పట్టింది. ఇక అక్కడినుంచి వెనుదిరిగి చూసుకోకుండా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొడుతోంది. ఈ క్రమంలో గుంటూరు కారం అవలీలగా 100 కోట్లు.. ఆపై 200 కోట్లు షేర్ అందుకుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. గుంటూరు కారం 10 రోజుల్లో మొత్తం రూ.231 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇదిలాగే కొనసాగితే మరో 2 రోజుల్లో రూ.250 కోట్లు టచ్ చేయొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆన్‌లైన్‌ లో మూవీస్‌ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =