ఒకటి కాదు రెండు కాదు ఎన్నో శతాబ్లాలుగా ఎదురుచూస్తున్న భారతీయుల కోరిక నేరవేరిన రోజు వచ్చేసింది. కొత్తగా నిర్మించిన ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలకు సైతం ఆహ్వానం అందింది. ఈ మహత్తర కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో సౌత్, నార్త్ నుండి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనిలోభాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అయోధ్య వెళ్లారు. ఈనేపథ్యంలో అక్కడ ఒక సెల్ఫీదిగి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రామకార్యం అంటే రాజ్య కార్యం ప్రజా కార్యం.. జై శ్రీ రామ్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతోనూ అలానే మరోపక్క రాజకీయాలతోనూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే రీఎంట్రీ తరువాత వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకోగా ఇంకా పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. వాటిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా ఒకటి. ఈసినిమా కూడా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి ఉంది.
రామకార్యం అంటే రాజ్య కార్యం
ప్రజా కార్యం…🙏 జై శ్రీ రామ్ pic.twitter.com/qkDGgRMWtZ— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: