టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ అలానే లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇక ఈసినిమాలో ఉన్న ఆసక్తికర విషయాలు ఎంటో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు
ఈసినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబే పెద్ద అసెట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు గత కొన్నేళ్లుగా మహేష్ చేస్తున్న సినిమాను చూస్తుంటే కాస్త క్లాస్ చాలా తక్కువ మాస్ తో వస్తున్నారు. అయితే ఈసారి తన రూట్ ను మార్చేసి ఫుల్ మాస్ తో వచ్చేస్తున్నారు. ఈరేంజ్ మాస్ ను మహేష్ కెరీర్ లో ఇంతవరకూ చూసి ఉండరు అన్నట్టుగా ఉంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లను బట్టి అర్థమవుతుంది. మాసీ లుక్ లో మహేష్ ను చూడటమే చాలా అరుదు.. అందులోనూ నోట్లో బీడీ పెట్టుకొనే మహేష్ ను చూడటం అయితే ఇంకా కష్టం.. అలాంటి రోల్ లో మహేష్ మాస్ డైలాగ్స్ చెప్పడం అంటే ఫ్యాన్స్ కు అసలైన పండగ అదే. ఈసినిమాకు ఇంత హైప్ రావడానికి కూడా ఇదే ప్రధాన కారణం.
త్రివిక్రమ్
టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్ లో త్రివిక్రమ్ సినిమా ఒకరు. త్రివిక్రమ్ కూడా తన సినిమాలను ఎక్కువగా మహేష్, పవన్, బన్నీ ఇలా కొద్దిపాటి హీరోలతోనే తన సినిమాలను రిపీట్ చేస్తుంటాడు. పవన్ తో మూడు సినిమాలు చేశాడు, బన్నీతో మూడు సినిమాలు చేశాడు.. మహేష్ తో ఇప్పటికే రెండు సినిమాలు తీశాడు. ఇప్పుడు రాబోతున్న గుంటూరుకారం మూడో సినిమా. ఇక త్రివిక్రమ్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మొదటి నుండీ త్రివిక్రమ్ సినిమాలు చూస్తే ఆయన సినిమాల్లో కూడా కాస్త క్లాస్ టచ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది త్రివిక్రమ్ కూడా మొదటి సారి మహేష్ కోసం మాస్ లోకి దిగారు. డైలాగ్స్ లో కూడా అది చూపించారు.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లో మహేష్-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కాంబినేషన్స్ లో ఇప్పటికే అతడు,ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ రెండు సినిమాలకు ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం. అతడు సినిమా బుల్లి తెరపై వారంలో ఒకసారి వేసినా కూడా ఇంకా చూసే ఆడియన్స్ ఉన్నారు. ఇక ఖలేజా విషయానికి వస్తే ఖలేజా సినిమా సిల్వర్ స్క్రీన్ పై బోల్తా కొట్టింది కానీ స్మాల్ స్క్రీన్ పై మాత్రం హిట్ అయింది. ఈసినిమా కూడా బుల్లితెరపై ఎప్పడు వచ్చినా చూస్తూనే ఉంటారు. అలాంటిది ముచ్చటగా మూడోసారి గుంటూరు కారం తో వస్తున్నారు. అయితే ఈసారి ఫుల్ మాస్ తో వస్తున్నారు.
శ్రీలీల
ఈసినిమాలో సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే శ్రీలీల తన మార్క్ ను చూపించుకుంది ఇండస్ట్రీలో. కుర్ర హీరోల దగ్గరనుండి సీనియర్ హీరోల వరకూ అందరినీ కవర్ చేస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. తన ఎనర్జిటిక్ నటన, సూపర్ డ్యాన్స్ తో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఈసినిమాలో కూడా తన నటన, డ్యాన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యేలా కనిపిస్తుంది. ముఖ్యంగా మహేష్ తో కాంబినేషన్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యేలా ఉంది. దానికితోడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మహేష్-శ్రీలీల మధ్య వచ్చే కుర్చీ మడతపెట్టి సాంగ్ కోసం..
థమన్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరు. ఈమధ్య కాలంలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు ధమన్. ఇక ఈసినిమాకు కూడా ఒక సూపర్ హిట్ ఆల్బమ్ తో వచ్చేశాడు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన ప్రతిపాట కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. అంతేకాదు టీజర్, ట్రైలర్ లలో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది.
మరి ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























