నా సామిరంగ ప్రీరిలీజ్ ఈవెంట్‌.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సూపర్ స్పీచ్

Allari Naresh and Raj Tarun Thanks To Nagarjuna For Giving Chance in Naa Saami Ranga Movie

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపధ్యంలో చిత్రబృందం తాజాగా ‘నా సామిరంగ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. “అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాగార్జున గారికి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ బాయ్‌ని. ఆయన్ని స్క్రీన్ మీద చూసి ఈలల వేసిన రోజుల నుంచి ఈ రోజు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా వుంది. డైరెక్టర్ విజయ్ బిన్నీ గారు అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా తీశారు. ఆయనకి హాట్సఫ్. నిర్మాతలు శ్రీనివాస్ గారికి, పవన్ గారికి థాంక్స్. అషిక, రుక్సర్, మిర్నా అందరూ చక్కగా నటించారు. మా టీంకి అండగా నిలుచున్న కీరవాణి గారు చంద్రబోస్ గారికి థాంక్స్’’ అని తెలిపారు.

ఇక మరో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ విజయ్.. లవ్ యూ. నరేష్ బ్రో.. నా సోపతి నీ సొంతం అన్న. నా మొదటి సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేశాను. తర్వాత ‘రంగులరాట్నం’, ‘అనుభవించు రాజా’ చిత్రాలు చేశాను. ఇప్పుడు నాగార్జున గారితో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. నాగార్జున గారికి ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు. కీరవాణి గారు సంగీతం అందించిన చిత్రంలో నేను భాగం కావడం నా అదృష్టం. అషిక, రుక్సర్, మిర్నా అందరికీ థాంక్స్. నిర్మాతలకు ధన్యవాదాలు. జనవరి 14న నా సామిరంగ వస్తుంది. ఈసారి పండక్కి అందరికీ పండగే. అక్కినేని ఫ్యాన్స్ థియేటర్స్‌లో పండగ చేసుకుంటారు’’ అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =