మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ లో మార్పులేదని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నందున రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి అయితే దీని గురించి మేకర్స్ ఇంతకుముందే క్లారిటీ ఇవ్వగా ఇప్పుడు మరోసారి అలాంటిదేమీ లేదని తెలిపారు.ఈరోజు డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ద్వారా విష్ చేస్తూ పుష్ప ది రూల్ అనుకున్నప్రకారం ఆగస్టు 15న విడుదలకానుందని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing the maverick director and the creator of the awe-inspiring world of #Pushpa, @aryasukku a very Happy Birthday ❤️🔥❤️🔥#Pushpa2TheRule will be bigger and grander with his vision 💫
Grand Release Worldwide on 15th AUG 2024🔥
Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil… pic.twitter.com/m9hBTQ6YwD
— Mythri Movie Makers (@MythriOfficial) January 11, 2024
ఇక ఈ సినిమా భారీ అంచానాలతో రానుంది.మొదటి పార్ట్ పుష్ప ది రైస్ బ్లాక్ బాస్టర్ కావడమే కాదు నార్త్ లో 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అల్లు అర్జున్ క్రేజ్ ను పెంచేసింది.తెలుగులో ఈసినిమా కోసం ఎంత ఎదురుచూస్తున్నారో నార్త్ లోకూడా అంతే హైప్ వుంది.ఈసినిమా 1000 కోట్లు కొట్టడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.అయితే గత కొన్ని నెలల నుండి సినిమాకు సంబంధించి మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు కానీ త్వరలోనే సాలిడ్ అప్డేట్ రానుందని సమాచారం.
ఈసినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఫస్ట్ పార్ట్ లో సాంగ్స్ నేషన్ వైడ్ గా పాపులర్ అయ్యాయి.ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా దేవి అలాంటి పాటలనే సిద్ధం చేస్తున్నాడట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: