నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ 10రోజుల్లో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 31.05కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసిందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.అయితే ఈ వారం నుండి ఈసినిమా కు భారీ పోటీ ఎదురుకానుంది.ఎందుకంటే ఈసంక్రాంతి బరిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు దిగుతున్నాయి దాంతో డెవిల్ కు కష్టం కానుంది.ఇక ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే డెవిల్ డీసెంట్ హిట్ అనిపించుకుంది.అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Historical Blockbuster #DevilTheMovie collects a massive worldwide gross of 31.05Cr in 10 days.
Book your tickets now! 🎫https://t.co/QGkuTQl7Gz #Devil – The British Secret Agent @NANDAMURIKALYAN@iamsamyuktha_ #MalvikaNair
Directed & Produced by #AbhishekNama… pic.twitter.com/WqyCYzrHHg— ABHISHEK PICTURES (@AbhishekPicture) January 9, 2024
ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని కళ్యాణ్ రామ్ ప్రకటించాడు.ఈఏడాది సమ్మర్ లో సీక్వెల్ మొదలుపెట్టె ఛాన్స్ వుంది.కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ డైరెక్షన్ లోతన 20వ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది. సరిలేరు నీకెవ్వరూ తరువాత ఆమె మళ్ళీ సినిమాలోనే నటిస్తుంది.ఈసినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు, భారీ బడ్జెట్ తో అశోక క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: