‘బబుల్‌గమ్‌’ హీరో రోషన్ కనకాలపై సిద్ధు, విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddu Jonnalagadda and Vishwak Sen Interesting Comments on Bubblegum Hero Roshan Kanakala

టాలీవుడ్ లోకి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ యాంకర్ సుమ, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల ‘బబుల్‌గమ్‌’ సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ బుకింగ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది. హీరోలు అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ నందిని రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ. ట్రైలర్‌ చూడగానే ఈ సినిమా హిట్‌ అవుతుందనిపిచింది. రోషన్‌ కమర్షియల్‌ హీరోలా కనిపించాడు. డ్యాన్స్‌, డైలాగ్‌ డెలివరీ.. ఇలా అన్ని అంశాలు బాగున్నాయి. శ్రీచరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు చాలా కలర్ ఫుల్ గా తీశారు. సుమ గారికి ఈ సినిమా ఎంత ప్రత్యేకమో.. నాకూ అంతే. ఎందుకంటే మా సోదరుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన రవికాంత్‌కి థాంక్స్. మానస తెరపై అద్భుతంగా కనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 29న బబుల్‌గమ్ థియేటర్స్ లో విడుదలౌతుంది. అంటుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఇక దమ్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రోషన్‌ చాలా లక్కీ అని అనుకుంటున్నా. రోషన్ విజయం సాధించాలని అందరూ కోరుకుంటారు. అతని సినిమా విజయం అందుకుంటే ఆనందించే వారిలో నేనొకడిని. ట్రైలర్‌లోని రోషన్‌ నటన చూస్తే కొత్తవాడిలా అనిపించట్లేదు. చాలా ఇంటెన్సిటీ వున్న నటుడిగా కనిపిస్తున్నాడు. రవికాంత్ పేరేపు తీసిన గత చిత్రం కృష్ణ అండ్ లీలా నేరుగా థియేటర్స్ లో విడుదల కావాల్సింది. చాలా మంచి సినిమా అది. కానీ కోవిడ్ వలన కుదరలేదు. ఈ సినిమాతో ఘనం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =