రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.మొదటి మూడు రోజులు ఎక్స్ట్రార్డినరీ వసూళ్లను సొంతం చేసుకున్న ఈసినిమా నాలుగో రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది.క్రిస్మస్ హాలిడే కావడంతో నాలుగో రోజు 70కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది.దాంతో 4రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 400కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో షేర్ 220కోట్లు. మరో 120కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసినట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు రాష్ట్రాల్లో అయితే సలార్ డ్రీం రన్ ను కొనసాగిస్తుంది.నాలుగు రోజుల్లో 110కోట్ల షేర్ ను రాబట్టుకుంది.నిన్న 18కోట్ల షేర్ తో అల్ టైం రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ 4రోజుల్లో 17.70కోట్ల ను రాబట్టుకుంది.నైజాంలో అయితే సలార్ సెన్సేషన్ సృష్టిస్తుంది.4రోజుల్లో 50కోట్ల షేర్ మార్క్ ను దాటేసింది.సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు విడుదల లేకపోవడం సలార్ కు కలిసి రానుంది.
దాంతో ఫుల్ రన్ లో సలార్ 1000కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు వున్నాయి. ఇక రాధే శ్యామ్ ,ఆదిపురుష్ తరువాత ప్రభాస్ సలార్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.ప్రశాంత్ నీల్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా రవి బస్రుర్ సంగీతం అందించాడు.విజయ్ కిరగందుర్ నిర్మించాడు.ఇక సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ గా రాగా రెండో పార్ట్ శౌర్యంగ పర్వం పేరుతో తెరకెక్కనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























