శ్రీలీల, కావ్యా థాపర్‌ గురించి రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ravi Teja Interesting Comments on Sreeleela and Kavya Thapar

మాస్ మహారాజా రవితేజ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. మరోవైపు రవితేజ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఈగల్‌’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ టీమ్‌కు మెమెంటోలు అందజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. నిర్మాత విశ్వప్రసాద్ గారికి అభినందనలు. ధమాకా నిన్నో మొన్నో విడుదలైనట్లుంది. ఏడాది అయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. సంగీత దర్శకుడు భీమ్స్‌ ఇచ్చిన పాటలకు.. తనకి మంచి గుర్తింపు వస్తుందని సినిమా విడుదలకాక ముందే బలంగా నమ్మాను. అదే నిజమైంది. ఇప్పుడు తను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మనకున్న సంగీత దర్శకుల్లో తను కూడా ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మళ్లీ మేం కలిసి పనిచేయబోతున్నాం. శ్రీలీల పెద్ద హీరోయిన్ అవుతుందని అప్పుడే చెప్పాను. ఊహించినట్లే శ్రీలీల హీరోయిన్‌గా అద్భుతంగా రాణిస్తోంది. ఆది, మంగ్లీ, మౌనిక టీం అందరికి పేరుపేరునా అభినందనలు” అని తెలిపారు.

“ఇక ‘ఈగల్‌’ సినిమా విషయానికి వస్తే,.. కార్తీక్‌ని కెమరామ్యాన్ గా చూశాం. ఇప్పుడు దర్శకుడిగా చూడబోతున్నాం. ఈ సినిమాతో కార్తీక్‌కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నా బలమైన నమ్మకం. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇందులో ప్రేక్షకులకు ఒక కొత్త రవితేజను చూపించబోతున్నాడు. అది నాకు చాలా తృప్తిని ఇచ్చింది. ఈ సినిమాలో కొత్త కావ్యా థాపర్‌ కనిపిస్తుంది. ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. దేవ్ జాంద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తను గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అవసరాల శ్రీనివాస్ చాలా సెన్సిబుల్ పర్సన్. విశ్వగారి ఆల్ ది వెరీ బెస్ట్. మా ప్రయాణం కొనసాగుతుంది” అని రవితేజ తెలిపారు.

కాగా ‘ఈగల్’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తుంది. అలాగే కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటివలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో ‘ఈగల్’పై అంచనాలని మరోస్థాయికి తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =