బిగ్ బాస్ 7.. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈసీజన్ మరో మూడు రోజుల్లో పూర్తవుతుంది. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు ఉన్నారు. శివాజీ, అర్జున్, అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్ ఉన్నారు హౌస్ లో. ఇక గత మూడు రోజులుగా వీరి జర్నీ వీడియోలు వేసి చూపిస్తున్నాడు. ముందు అమర్, అర్జున్.. తరువాత ప్రియాంక, అర్జున్.. నిన్న ప్రశాంత్, యావర్ ల జర్నీవీడియోలు వేసి చూపించాడు బిగ్ బాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవారం ఫైనల్ వీక్ కావడంతో ఎలాంటి గేమ్స్ లేకపోవడంతో హౌస్ మేట్స్ కూడా రిలాక్స్ అవుతున్నారు. దీంతో బిగ్ బాస్ వారిని ఖాళీగా ఉంచడం ఎందుకని మళ్లీ గేమ్స్ తో వచ్చాడు. హాచీ ఎలియన్స్ అంటూ కొత్త గేమ్ తో వచ్చాడు. దీనిలో భాగంగానే ఇంటి నుండి ఫుడ్ వచ్చిందని చెబుతూ అయితే తమ ఆహారం కోసం వేరే కంటెస్టెంట్లు ఆడాల్సి వస్తుందన్న ట్విస్ట్ అయితే ఇచ్చాడు. దీనిలో భాగంగా ముందుగా అర్జున్ ఇంటి నుండి ఫుడ్ వచ్చిందని దాని కోసం యావర్ షేక్ బాల్ షేక్ గేమ్ ఆడాలని చెబుతాడు. ఇక యావర్ తన టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడంతో అర్జున్ కు ఆ ఫుడ్ వస్తుంది.
ఆ తరువాత శివాజీకి ఇంటినుండి చికెన్ కర్రీ వస్తుంది. ఈ కర్రీ కోసం ప్రియాంక గేమ్ బ్యాలెన్సింగ్ గేమ్ ఆడాలని చెబుతాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో ప్రియాంక విన్ అవుతుంది. శివాజీ కి చికెన్ కర్రీ వస్తుంది. అనంతరం అమర్ కు రొయ్యల బిర్యాని వస్తుంది. దీనికోసం శివాజీ 3 నిమిషాల్లో బెలున్స్ ను బగలకొట్టాల్సి వస్తుంది. శివాజీ కూడా గేమ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడంతో అమర్ కు బిర్యానీ వస్తుంది.
ఇక ఈ గేమ్ తరువతా మరో టాస్క్ ను ఇచ్చాడు. ఈ 14 వారాల జర్నీలో ఎవరు ఎన్ని నిమిషాలు కనపడతారో చెప్పాలని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎవరి తోచినట్టుగా వారు ఇతర కంటెస్టెంట్ లకు నెంబర్లు ఇచ్చారు. దీంతో గురువారం ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: