ఇట్లు అర్జున మ్యూజికల్ కన్సర్ట్‌కు రానున్న నాగార్జున , రామ్ చరణ్ , అఖిల్

Nagarjuna, Ram Charan and Akhil to Attend Itlu Arjuna Musical Concert

అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన వినూత్న ప్రణయ కథా చిత్రం ‘ఇట్లు అర్జున’ భారీ మ్యూజికల్ కన్సర్ట్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ మ్యూజికల్ కన్సర్ట్ వేడుకకు అక్కినేని నాగార్జున, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు అక్కినేని అఖిల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈవేడుక ఈరోజు హైటెక్స్ హాల్ లో మ్యూజిక్ కన్సర్ట్ గ్రాండ్ గా జరుగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రానున్న ఈ ప్రాజెక్ట్‌కు మహేష్ ఉప్పల దర్శకత్వం వహించారు. మూగ యువకుడి ప్రేమకథ, ఎమోషన్స్ మరియు పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి.అందులో భాగంగా ఇప్పటికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేసి సినిమాకు మరింత హైప్ తీసుకురాగా ఇక ఇప్పుడు మ్యూజికల్ కన్సర్ట్‌ నిర్వహించి అంచనాలు మరింతగా పెంచనున్నారు.

ఎస్. థమన్ స్వరపరిచిన పాటలు ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోగా, ఈ మ్యూజికల్ కన్సర్ట్‌లో థమన్ అండ్ టీమ్ అందించబోయే లైవ్ పర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనికితోడు నాగార్జున, రామ్ చరణ్ మరియు అఖిల్ ఒకే వేదికపై సందడి చేయనుండటంతో ఈ కన్సర్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.