జీవిత చెబితే నేను వింటాను అని అంతా అనుకుంటారు, కానీ.. రాజశేఖర్

Extra Ordinary Man Pre Release Event Rajasekhar and Jeevitha Funny Speech

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్‌, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘నన్ను ఒకసారి సడెన్‌గా పిలిచారు. ఈ కథ చెప్పారు. నన్ను కన్విన్స్ చేశారు. స్పెషల్ అప్పియరెన్స్ పాత్రను చేశాను. నాకు నచ్చింది. బాగుందని చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, నితిన్‌కు థాంక్స్. జీవిత చెబితే నేను వింటాను అని అంతా అనుకుంటారు. కానీ నేను చెప్పిందే జీవిత వింటుంది. ఆమె నా మంచికే చెబుతుంటుంది కాబట్టి ఏం చెప్పినా నేను వింటాను. తెరపై జాలీగా, ఆకతాయిగా నటిస్తారు కదా? సెట్‌లోనూ అలానే ఉంటారని అనుకున్నాను. కానీ సెట్స్ మీద హీరోగా, నిర్మాతగా ఎంతో బాధ్యతతో ఉండేవారు. దర్శకుడు నన్ను బాగా చూపించారు’ అని అన్నారు.

ఇక రాజశేఖర్ సతీమణి, సీనియర్ నటి జీవిత మాట్లాడుతూ.. ‘భార్యభర్తలు అంటూ ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి గురించి ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. మంచి పాత్ర దొరికితే ఆయన విలన్‌‌గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు. మాకు వంశీ ఏం చెప్పారో అదే తీశారు. సుధాకర్ రెడ్డి గారు మా ఆయన చేసిన మగాడు సినిమాతో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. అది చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీలీలకు పెద్ద విజయం రావాలి’ అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 10 =