శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్‌ – హీరో నితిన్

Extra Ordinary Man Pre Release Event Nithiin Interesting Comments on Sreelela

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల రియల్ లైఫ్‌లో ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్‌ అని పేర్కొన్నారు హీరో నితిన్‌. శ్రీలీలతో కలిసి ఆయన జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమా నాకు చాలా స్పెషల్. ఇంత వరకు నేను ఇలాంటి కారెక్టర్ చేయలేదు. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు వక్కంతం వంశీకి థాంక్స్. ఖ్యాతీ, రిత్విక్ పాత్రలతో ప్రేమలో పడతారు. ప్రతీ పాత్రకు ఇందులో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రాజశేఖర్ గారు చేసిన ‘మగాడు’ సినిమాతో మా నాన్న డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ సినిమా హిట్ అయింది కాబట్టే మా నాన్న ఈ ఇండస్ట్రీలో ఉన్నారు.. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఉన్నాను. ఇలా మళ్లీ మీరు నా సినిమాలో ఇలా స్పెషల్ రోల్ చేసినందుకు థాంక్స్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “హ్యారిస్ జైరాజ్ గారు మంచి పాటలు ఇచ్చారు. ఇందులో ఆర్ఆర్ చాలా కొత్తగా ఉంటుంది. మా డీఓపీ యువరాజ్‌తో మూడు సినిమాలు చేశాను. నన్ను ఎలా చూపించాలో ఆయనకు తెలుసు. శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా కూడా మాకు అవసరమైనప్పుడు డేట్స్ ఇచ్చారు. సినిమాలో నేను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ కానీ.. రియల్ లైఫ్‌లో శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్‌. నాకు, నా దర్శకుడికి ఈ సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నిర్మాతలకు లాభాలు రావాలి. సినిమాను చూసి నా ఫ్యాన్స్, ప్రేక్షకులు అంంతా కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు. డిసెంబర్ 8న గట్టిగా కొట్టబోతోన్నాం” అని చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 5 =