బిగ్ బాస్ 7-టికెట్ టు ఫినాలే షురూ

bigg boss season 7 telugu ticket to finale race began

బిగ్ బాస్ సీజన్ 7.. 13 వారంలోకి అడుగుపెట్టేసింది. ఇక ఈవారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. హీటెట్ ఆర్గ్యుమెంట్స్ తో సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తవ్వగా ఫైనల్ గా ఈవారం అమర్ తప్ప మిగిలిన హౌస్ మేట్స్ శివాజీ, యావర్, ప్రశాంత్, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభ అందరూ నామినేషన్ లోకి వచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ లు పెట్టిన బిగ్ బాస్ ఈవారం టికెట్ టు ఫినాలే టాస్క్ లతో వచ్చేశాడు. సోమవారం ఎపిసోడ్ నామినేషన్ ప్రాసెస్ తో ముగియగా.. మంగళవారం ఎపిసోడ్ అక్కడ నుండే మొదలవుతుంది. అందరూ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటారు. అయితే శివాజీ మాత్రం అర్జున్ నామినేషన్ ను మాత్రం తీసుకోలేకపోతాడు. అర్జున్ ది పిచ్చి స్ట్రాటజీ అంటూ అసహనం వ్యక్తం చేస్తాడు.

అ తరువాత టికెట్ టు ఫినాలే గేమ్ ను మొదలుపెడతాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా పలు గేమ్స్ పెడతాడు బిగ్ బాస్. ఫైనల్ గా ఎవరిదగ్గర అయితే పాయింట్స్ ఎక్కువగా ఉంటాయో వారు ఫినాలే టికెట్ ను సొంతం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో మొదటిగా టిక్ టాక్ టిక్ అనే టాస్క్ ను ఇస్తాడు బిగ్ బాస్. ఇందులో గడియారం లాంటి బేస్ ఉంటుంది.. అందులో ఉండే బాణం తిరుగుతుంటుంది.. ఎవరైతే కాలు కింద పెడతారో వారు గేమ్ నుండి ఔట్ అవుతారు. ఆ తరువాత కాలుకి బాణం తగిలినా గేమ్ నుండి తప్పుకోవాలన్న ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. ఇక ఈ గేమ్ లో ముందుగా ప్రశాంత్ ఔట్ అవుతాడు.. ఆ తరువాత వరుసగా గౌతమ్, శోభా, శివాజీ, యావర్, అమర్, ప్రియాంక వరుసగా గేమ్ నుండి ఔట్ అవుతారు. అర్జున్ ఈ గేమ్ లో విన్ అవుతాడు.

అనంతరం రెండో టాస్క్ గా పూలను సేకరించే టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ ముగిసేసరికి శోభా, శివాజీ దగ్గర తక్కువ పూలు ఉండటంతో గేమ్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే వారి దగ్గర ఉన్న పూలను తమకు ఇష్టమున్న వారికి ఇచ్చే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. అలా ఇద్దరూ తమ పూలను అమర్ కు ఇచ్చేస్తారు. దాంతో అమర్ దగ్గర ఎక్కువ పూలు ఉంటాయి. అనంతరం గాలం వేయ్ బుట్టలో పడేయ్ అనే గేమ్ ఇచ్చాడు. రింగ్ తో బంతిని బయటకు లాగి బుట్టలో వేయాల్సి ఉంటుంది. ఇక ఈ గేమ్ లో నుండి ప్రియాంక ఔట్ అవుతుంది. ఇక్కడితో మంగళవారం ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి ఈరెండు రోజుల్లో ఎలాంటి గేమ్స్ ఇస్తాడు.. చివరి ఎవరు ఫినాలే టికెట్ ను సొంతం చేసుకుంటారు అన్నవిషయం తెలియాలంటే రెండు రోజులు వెయట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fourteen =