ధనుష్ కెప్టెన్ మిల్లర్ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Dhanush's Captain Miller New Release Date Announced

నేషనల్ అవార్డ్ విన్నర్, కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్‍గా ట్రెండ్ అయ్యింది. సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వారు ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఎక్స్‌లో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో గుబురు గడ్డం, మ్యాసీ హెయిర్, షేడ్స్ తో టెర్రిఫిక్ గా కనిపించారు ధనుష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కాగా 1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యాజ్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివ రాజ్‌కుమార్‌, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ పీరియాడిక్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమాను సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై టిజి త్యాగరాజన్, సెంధిల్ త్యాగరాజన్ , అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. జి శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నుని డీవోపీగా, నాగూరన్ ఎడిటింగ్‌ను అందిస్తున్నారు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − two =