పి. మహేష్ బాబు దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి ఈసినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ బాగా నచ్చింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాపై మరో క్రికెటర్ ప్రశంసలు కురిపించాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు దినేష్ కార్తీక్. ఈసినిమా చూసిన దినేష్ కార్తీక్ వెయిట్ చేసినందుకు వర్త్ అనిపించింది.. ఈసినిమాను తాజాగా చూశాను.. నవీన్ పోలిశెట్టి మరోసారి మంచి కథను ఎంచుకొని తన కామెడీతో అలరించాడు అంటూ తన ట్విట్ లో పేర్కొన్నాడు.
So much love for #MissShettyMrPolishetty. Thank you so much @DineshKarthik ❤️ loving your commentary in this World Cup. Let’s go India 🙏💪🔥 #CW2023 https://t.co/RcwG4XFZPi
— Naveen Polishetty (@NaveenPolishety) November 8, 2023
కాగా ఈసినిమాలో ఇంకా జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: