విశ్వక్ సేన్ ‘గామి’ మూవీ ఫైనల్ ఎడిట్ లాక్

Vishwak Sen's Starring Gaami Movie Final Edit Gets Locked

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఫ్యాన్స్ ముద్దుగా ‘మాస్ కా దాస్’గా పిలుచుకునే విశ్వక్ ఇటీవల సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. జపయజయలతో సంబంధం లేకుండా ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈపాటికే ఈ ఏడాది మార్చిలో ‘దాస్ కా ధమ్‌ కీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం చేస్తోన్న చిత్రం ‘గామి’. అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ అఘోరాగా కనిపించబోతున్నాడు. విద్యాధర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీ సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్ శబరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అయితే వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల విడుదల ఆలస్యమైంది. దీంతో చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘గామి’ మూవీకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.

ఈ మూవీ ఫైనల్ ఎడిట్ లాక్ చేసినట్లు ప్రకటించారు. ‘గామి’ మూవీ ఫైనల్ అవుట్ ఫుట్ రెడీ అయిందని, ఇక త్వరలోనే థియేటర్లలో రిలీజ్ అవబోతోందని వెల్లడించారు. కాగా ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉండగా విశ్వక్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాలో కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ‘బెదురులంక’ ఫేమ్ నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే విడుదల కానుంది. అలాగే మరోవైపు విశ్వక్‌ సేన్‌ 20వ సినిమా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eight =