విష్ణు మంచు కన్నప్ప అప్‌డేట్‌.. న్యూజిలాండ్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూటింగ్

Vishnu Manchu's Kannappa Shoot Happening in Beautiful Locations of New Zealand

డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. దీనిలో భాగంగా మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కాగా ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ లో 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుంది. అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నారు. ఇలాంటి భారీ చిత్రానికి న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సెట్ అవుతుంది. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలను ఇక్కడే షూట్ చేశారు. ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చేందుకు ‘కన్నప్ప’ టీమ్ ప్రయత్నిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా దేవుడి సృష్టిలో న్యూజిలాండ్ అనేది అందమైన పెయింటింగ్ లాంటిది.. కన్నప్ప సినిమాకు న్యూజిలాండ్ అనేది పర్ఫెక్ట్ లొకేషన్. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, కన్నప్పలోని ఎమోషన్‌ను న్యూజిలాండ్‌లోని లొకేషన్లు ఇంకా ఎలివేట్ చేస్తాయని ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు తెలిపారు. న్యూజిలాండ్‌లోని ప్రకృతి దృశ్యాలను, అత్యాధునిక సినిమాటిక్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ కన్నప్ప సినిమాతో ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపే దృశ్యకావ్యంగా రూపొందించాలని మంచు విష్ణు భావిస్తున్నారు. ‘న్యూజిలాండ్‌లో ప్రారంభించిన ఈ మూవీని అత్యుత్తమ రీతిలో చిత్రీకరించేందుకు ఎంతో అంకితభావంతో పని చేస్తున్నాం. అగ్రశ్రేణి ప్రతిభావంతులు, నటీనటులు, అత్యాధునిక సాంకేతికతతో, రాబోతున్న తరాల వారికి గుర్తిండిపోయేలా ఓ కళాఖండంగా ఈ కన్నప్పను తెరకెక్కిస్తున్నామని’ మంచు విష్ణు అన్నారు.

ఇక ‘కన్నప్ప’ చిత్రాన్ని ‘అవా ఎంటర్టైన్మెంట్‌’ మరియు ’24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ’ పతాకంపై విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మించనున్నారు. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్‌ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి తదితరులు స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 5 =