లియో ఫస్ట్ డే కలెక్షన్స్- ఈఏడాది ఈసినిమానే

vijay leo movie first day worldwide collections

దళపతి విజయ్ నుండి సినిమా వస్తుందంటే మరోసారి లియో సినిమా నిరూపించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా అప్పుడే కొత్త రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. తమిళ్ నాడులో ఫస్ట్ డే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకోగా.. తెలుగులో ఈసినిమా 16 కోట్ల గ్రాస్ ను రాట్టుకుంది. తెలుగులో భగవంత్ కేసరి మూవీ ఉన్నా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టుకుందంటే మాములు విషయం కాదు. ఇక ఫస్ట్ డే నే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. అంతేకాదు ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన మొదటిసినిమాగా ఈసినిమా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడ మాత్రమే కాదు ఈసినిమా యూకేలో కూడా క్రేజీ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఫస్ట్ డే కి ఈసినిమా యూకే లో 571కే పౌండ్లు కలెక్ట్ చేసింది. ఒక ఇండియన్ ఈసినిమా ఫస్ట్ డే కి ఈరేంజ్ కలెక్షన్స్ ను రాబట్టుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి.

కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ పలు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 5 =