లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చిన లియో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంది.నిన్నవిడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తొలి రోజు 16కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ భగవంత్ కేసరి రూపంలో గట్టి పోటీ వున్నా కూడా ఈరేంజ్ వసూళ్లను సాధించడం గొప్ప విషయమే. ఈనాలుగు రోజులు కూడా లియో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.
ఇక రేపటి తో ఈసినిమా బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేయనుంది.దాంతో ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకరానుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెలుగులో విడుదలచేసింది. ఇదిలావుంటే కోలీవుడ్ లో లియో మొదటి రోజు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టింది. తొలి రోజు అక్కడ 70కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హైయెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టిన సినిమా గా రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా లియో మొదటి రోజు 145కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్,అర్జున్ సర్జ,గౌతమ్ వాసు దేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. సెవెన్ స్క్రీన్ బ్యానర్ ఫై లలిత్ కుమార్ ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
LEO Telugu Public Talk | LEO Public Review | Thalapathy Vijay | Lokesh Kanagaraj | Anirudh | TFN
03:20
LEO Telugu Release Press Meet by Naga Vamsi | Thalapathy Vijay | Lokesh Kanagaraj | Anirudh
07:22
కలెక్షన్ల విషయంలో నిజాలు చెప్పం.. మీకు నచ్చింది రాసుకోండి | #NagaVamsi | #LEO Press Meet | #Shorts
00:44
Producer Naga Vamsi Teases Suresh Kondeti | MAD Movie Team Q&A With Media | Narne Nithin | TFN
11:30
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: