పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి అలానే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఉంటాయి ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్స్. సినిమాల సంగతి పక్కన పెడితే పవన్ ను ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఎంతోో ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. ఎవరిని పవన్ కళ్యాణ్ గురించి అడిగినా పాజిటివ్ గానే రెస్పాన్స్ అవుతారు. ఇక ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ కూడా పవన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు బోయపాటి శ్రీను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి శ్రీను ను పవన్ గురించి అడగగా దానికి ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్టర్ లేని వాడు.. ఏది అనుకుంటే అది చేస్తాడు..ఎక్కడ మంచి ఉంటే అక్కడికి వెళ్లి నిలబడతాడు.. ఎక్కడ నిజాయితీ ఉంటే అక్కడ ఉంటాడు..న్యాయం ఉన్న చోట అడ్డ సుడిగా ఎదురుతిరుగుతాడు అంటూ హ్యాట్సాఫ్ అతనికి అంటూ ప్రశంసించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Director #BoyapatiSreenu Latest comments on Power Star @PawanKalyan⚡🔥#PawanKalyan #OG #UBS #HHVM #TeluguFilmNagar pic.twitter.com/EkxA3s3sQF
— Telugu FilmNagar (@telugufilmnagar) October 20, 2023
కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతోనూ అలానే మరోపక్క రాజకీయాలతోనూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే రీఎంట్రీ తరువాత వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ సినిమా ఒకటి ఇంకా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: