కీడా కోలా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Keedaa Cola First Single Dipiri Dipiri Lyrical Video Out

టాలీవుడ్‌లోని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో త‌రుణ్ భాస్కర్‌ దాస్యం ఒకరు. తొలి సినిమా ‘పెళ్లి చూపులు’ తోనే నేషనల్ అవార్డును పొందిన ఆయన.. రెండో ప్రయత్నంగా తీసిన ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే దర్శకత్వంతో పాటు అడపా దడపా కొన్ని చిత్రాల్లోనూ నటించారు ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ క‌మ్ యాక్టర్‌. ఈ క్రమంలో తాజాగా ‘కీడా కోలా’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. క్రైం కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్‌ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఇందులో వరదరాజులు (తాత) అనే పాత్రలో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వచ్చే నెల తొలివారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా సినిమాకి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ మరియు ట్రైలర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ‘కీడా కోలా’ నుండి ఫ‌స్ట్ సింగిల్ విడుదల చేశారు. ‘డిపిరి డిపిరి’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోను శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ పాటను గీత రచయిత భ‌ర‌ద్వాజ్ రాయగా.. గాయకుడు హనుమాన్ ఆలపించారు. అలాగే వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.

కాగా ఈ సినిమాలో త‌రుణ్ భాస్కర్‌, చైత‌న్య రావు, రవీంద్ర విజయ్‌, హరికాంత్, రఘురామ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఉపేంద్ర వర్మ ఎడిటర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వీజీ సైన్మా బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో రానా ద‌గ్గుబాటి సమర్పణలో ‘కీడా కోలా’ నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే త‌రుణ్ భాస్కర్‌కి ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావ‌డం విశేషం. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.