బిగ్ బాస్ 7-వాదనలతో హోరెత్తిన హౌస్

bigg boss season 7 telugu day 45 highlights

బిగ్ బాస్7..ప్రస్తుతం హౌస్ లో ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. దీనికోసం ఇంటి సభ్యులను గులాబీ పురం, జిలేబీపురం అంటూ రెండు టీమ్ లుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. ఇక మొదటిగా ఎగ్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో చేయాల్సింద్ ఏంటంటే ఒక చిన్న బల్లపై గుడ్డును పెట్టి ఒక వైపున నుండి మరో వైపుకు తీసుకెళ్లాలి. ఇక ఈ గేమ్ లో అశ్విన్, ప్రశాంత్, సందీప్, అర్జున్ జిలేబి పురం నుండి పాల్గొనగా.. అమర్ దీప్, గౌతమ్, తేజ, యావర్ గులాబీపురం నుండి పాల్గొన్నారు. ఈ టాస్క్ లో జిలేబీపురం టీమ్ గెలుస్తుంది అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గులాబీ పురం, జిలేబీపురం గ్రామ ప్రజలుగా కంటెస్టెంట్ లు వారికి ఇచ్చిన పాత్రల్లో నటిస్తూనే ఉంటారు. మరోవైపు బిగ్ బాస్ మరో గేమ్ తో వచ్చేశాడు. ఈసారి అండర్ ది వాటర్ అంటూ మరో టాస్క్ ఇచ్చాడు. ఇక ఈ టాస్క్ లో అమర్ దీప్- సందీప్ రాగా సందీప్ గెలవడంతో జిలేబీపురం టీమ్ గెలుస్తుంది. మరోవైపు అమర్ ఓడిపోవడంతోో శోభా ఒక్కసారిగా ఫైర్ అవుతుంది. గెలుస్తామన్న నమ్మకం లేకపోతే వెళ్లకూడదు.. అన్ని గేమ్స్ ఓడిపోతున్నాం అంటూ అసహనం వ్యక్తంచేస్తుంది.

ఆ తర్వాత స్పేస్ షిప్ గేమ్ ఇస్తాడు బిగ్ బాస్. ఈగేమ్ లో ప్రశాంత్-గౌతమ్ పోటీ పడగా ఈ గేమ్ లో గౌతమ్, ప్రశాంత్ మధ్య పెద్ద గొడవనే జరిగింది. దీంతో గులాబీపురం టీమ్ కు ఒక పాయింట్ వస్తుంది. ఇక ఇక్కడ అమర్ దీప్-ప్రియాంక ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. మాకు వచ్చింది ఒక్క పాయింటేలే.. సల్లబడు అంటూ ప్రియాంకను అమర్ దీప్ అనగా.. దానికి ప్రియాంక ఓవర్ గా మాట్లాడకు అంటూ కోప్పడింది. దానికి నేను సరదాగా అన్నాను అంటూ ఆఖరికి సారీ కూడా చెప్పాడు అమర్ దీప్.

ఇక హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అవుతుండగా మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. తేజ కోసం ఒక కేక్ పంపించాడు. అయితే దానిపై శోభ అని రాసి ఉంది. అంతేకాదు ఇది ముగింపు కాదు ముందుంది ముసళ్ల పండగ అంటూ ఒక నోట్ కూడా పంపాడు. దీంతో తేజ ఎందుకు ఇలా పంపాడా అని కాసేపు ఆలోచించాడు. ఈ క్రమంలో కేక్ లోని ఒక ముక్కను తీసుకొని తిన్నాడు అమర్. దాంతో తేజ, శోభ అమర్ పై ఫైర్ అయ్యారు. కేక్ మీద నాపేరు ఉంటే నువ్వెలా తీంటావు అంటూ శోభా కాసేపు హంగామా చేసింది. ఆ తర్వాత ఎంతోసేపు ఆలోచించిన తేజ ఆ కేక్ ను కట్ చేసి హౌస్ మేట్స్ అందరికీ ఇచ్చాడు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి కెప్టెన్సీ కంటెండర్లుగా ఎవరు నిలిచారు.. ఫైనల్ గా కెప్టెన్ ఎవరయ్యారు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.