మోస్ట్ అవైటెడ్ ఫిలిం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈసినిమా కోసం కేవలం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పైనల్ గా నిన్న రిలీజ్ అయింది. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా రిలీజ్ కు ముందే విదేశాల్లో పలు రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఒక్క యూఎస్ లోనే రిలీజ్ కు ముందే 1మిలియన్ ప్రీసేల్స్ అయ్యాయి. యూకే లో కూడా ఈసినిమా రిలీజ్ కు ముందే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకోగా.. ఇప్పుడు రిలీజ్ తరువాత కూడా ఈసినిమా యూకేలో క్రేజీ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఫస్ట్ డే కి ఈసినిమా యూకే లో 571కే పౌండ్లు కలెక్ట్ చేసింది. అలానే ఐర్లాండ్ లో 36కే పౌండ్లు కలెక్ట్ చేసుకుంది. ఒక ఇండియన్ ఈసినిమా ఫస్ట్ డే కి ఈరేంజ్ కలెక్షన్స్ ను రాబట్టుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి.
The #LEO roar overseas is EARTH SHATTERING. Additional UK locations have reported their numbers, taking our opening day number to £571.5K. This is an ALL TIME Indian film record that will be stamped in the history books! 💥🤯🥵💣🌋 pic.twitter.com/AuDqID0T9g
— Ahimsa Entertainment (@ahimsafilms) October 20, 2023
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ పలు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: