పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఒకపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మరోపక్క మినిమం బడ్జెట్ తో కామెడీ కమర్షియల్ తీసి పలు హిట్స్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్ పై ఇప్పటినుండే మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను మారుతి ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడా.. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందా అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి ని ఈసినిమా అప్ డేట్స్ గురించి అడుగగా పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. సినిమా అయితే ఉందని ప్రపంచానికి తెలుసు.. ఒక మంచి వాతావరణంలోనే సినిమా జరుగుతుంది.. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతాను. ప్రతి హీరోకు ఒక స్ట్రాటజీ ఉంటుంది.. అందులోనూ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.. అన్ని సినిమాల అప్ డేట్లు ఒక్కసారే ఇస్తే ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అంతేకాని మరే కారణం లేదు.. అందులోనూ సినిమా రావడానికి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పుడు ఇప్పటినుండే అప్ డేట్లు ఇచ్చుకుంటూ వెళ్తే అప్పటికీ ఉన్న హైప్ తగ్గిపోతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.
కాగా థ్రిల్లర్ కమ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి చూద్దాం ఈసినిమా ఏరేంజ్ లో ఉండబోతుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: