తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు అగ్రహీరోలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనపై తనకు గల అభిమానాన్ని, గౌరవాన్ని తెలుపుతూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు. అందులో.. “శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు” అని పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా చిరంజీవి ఇలా తెలిపారు.. “ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి, నా సోదరుడు నాగార్జునకి, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు!! ” అని చెప్పారు.
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను.
ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని… pic.twitter.com/yrAxhk7pgb
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2023
కాగా నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహుతులు అక్కినేని నాగేశ్వరరావు సాధించిన ఘనతను, తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: