గోమతేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శ్రీమతి కుమారి. సెలక్టివ్ గా సినిమాలు ఎన్నుకునే నిత్యామీనన్ నుండి ఈసినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఈసినిమాలో కంటెంట్ ఉంటుందని అప్పుడే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఈసినిమాను చాలా సైలెంట్ గా పూర్తిచేశారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి రీసెంట్ గానే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. మహానటి కీర్తిసురేష్ ఈసినిమా టీజర్ ను తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ ను సైతం అందించారు. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. సెప్టెంబర్ 28వ తేదీ నుండి ఈసినిమా ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: