అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. తను కూడా రొటీన్ ఉండే కథలకు గుడ్ బై చెప్పి కాస్త డిఫరెంట్ గా ఉండే కథలనే ఎంచుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే మరోసారి కొత్త కథతో రాబోతున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఓ మత్స్యకారుడు జీవితం ఆధారంగా.. రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని ఈసినిమాను తీస్తున్నారు. ఇప్పటికే ఆదిశగా హోం వర్క్ కూడా చేశారు. ఈమధ్యనే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయని కూడా తెలియచేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాలో నటించే హీరోయిన్ పై అప్ డేట్ ఇచ్చారు. మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేస్తూ ఆమె ఈసినిమాల జాయిన్ అవుతుంది అంటు తెలిపారు. ఇక వీడియోలో హీరో నాగచైతన్య తో పాటు డైరెక్టర్ చందూ మొండేటి, అల్లు అరవింద్, బన్నీ వాసు ఇంకా హీరోయిన్ కూడా ఉన్నారు. అయితే విశేషం ఏంటంటే ఆ హీరోయిన్ ఎవరు అనేది చెప్పకుండా, ఫేస్ రివీల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టారు. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మాత్రం మేకర్స్ చెప్పేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
The widely adored and loved lady joins the voyage of #NC23 ⛵#ShejoinstheNC23Voyage
Yuvasamrat @chay_akkineni @chandoomondeti #BunnyVas @GeethaArts #KarthikTheda pic.twitter.com/aguJI6QOjs
— GA2 Pictures (@GA2Official) September 19, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























