డెవిల్ నుండి మెస్మరైజింగ్ మాయే చేసి ఫుల్ సాంగ్ రిలీజ్

maaye chesi full song released from kalyan rams devil movie

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. దానికి తోడు పోస్టర్లు గ్లింప్స్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈసినిమాతో కూడా కళ్యాణ్ రామ్ మంచి హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ను ప్రారంభిస్తున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ తెలియచేసిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి మాయే చేసి అంటూ వచ్చే పాట ప్రోమోను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా. సిద్ శ్రీరామ్ పాడిన ఈపాట ప్రోమోకే మంచి రెస్పాన్స్ వచ్చింది. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ మధ్య మెలోడియస్ గా ఈపాట ఉండబోతుందని అర్థమైంది. ఇక ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పాట అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.