సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథ‌ర్ కింగ్‌ ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్

Sampoornesh Babu's Martin Luther King First Look Released

టాలీవుడ్ హీరోలలో సంపూర్ణేష్ బాబుది ప్రత్యేక స్థానం. ఫక్తు కామెడీ సినిమాలు చేయడం ఆయన స్టయిల్. స్ఫూఫ్ కామెడీతో రూపొందే సంపూర్ణేష్ బాబు సినిమాలకు తెలుగునాట ప్రత్యేక ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందుకే దర్శకులు కూడా ఆయనను కామెడీ యాంగిల్ లోనే ప్రాజెక్ట్ చేస్తుంటారు. తన మొదటి సినిమా ‘హృదయ కాలేయం’.. ఆ తర్వాత వచ్చిన ‘సింగం 123’, ‘కొబ్బరిమట్ట’ తదితర సినిమాలు వినోద ప్రధానంగానే రూపొందాయి. అలాగే ’బజార్ రౌడీ’, ‘పెసరట్టు’, ‘వినోదం 100%’ ‘హాఫ్‌ స్టోరీస్‌’ మొదలైన చిత్రాల్లో కూడా సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించాడు. ఈ క్రమంలో ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న కొత్త చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకు ‘మార్టిన్ లూథ‌ర్ కింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాను అక్టోబ‌ర్ 27న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు కూడా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇక ఈ పోస్ట‌ర్‌లో సంపూర్ణేష్‌ బాబు త‌ల‌పై ఒక కిరీటం ఉండ‌గా.. అందులో కొందరు నాయ‌కులు ఓట్ల కోసం ప్ర‌చారం చేస్తున్నారు. ఇలా డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ ఆస‌క్తిని పెంచుతోంది. దీంతో ఇది పొలిటిక‌ల్ కామెడీగా ఉండబోతున్నట్లు అర్ధమవుతోంది. కాగా ఈ సినిమాలో ‘C/o కంచరపాలెం’ ఫేమ్ డైరెక్ట‌ర్ వెంక‌టేష్ మ‌హా, సీనియర్ నటుడు న‌రేష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

కాగా ‘మార్టిన్ లూథ‌ర్ కింగ్’ ఓ కోలీవుడ్ సినిమాకు రీమేక్ అని వినిపిస్తోంది. ప్రముఖ త‌మిళ కమెడియన్ యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘మండేలా’ సినిమాను తెలుగుకు అనుగుణంగా రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మేకర్స్ దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్, ఏపీఐ ఫిల్మ్స్ పతాకాలపై ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, శిబాశిష్ సర్కార్, ఎల్. వేణుగోపాల్ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =