రజినీకాంత్‍కు వన్డే ప్రపంచకప్‌ గోల్డెన్ టికెట్ అందించిన బీసీసీఐ

Rajinikanth Gets Golden Ticket For ICC World Cup 2023 From BCCI

సూపర్ స్టార్ రజినీకాంత్‍కు ఒక అరుదైన గౌరవం లభించింది. ఈ యేడాది ఇండియాలో జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి గోల్డెన్ టికెట్ అందుకున్నారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఈరోజు చెన్నైలోని రజినీకాంత్ నివాసానికి వెళ్లి మరీ ఈ గోల్డెన్ టికెట్ అందజేశారు. ఈ మేరకు విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా.. “బీసీసీఐ కార్యదర్శి జైషా.. రజినీకాంత్‍కు గోల్డెన్ టికెట్ అందించారు. భాషలు, సంస్కృతులకు అతీతంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో లెజెండరీ నటుడు రజినీకాంత్ చెరగని ముద్రవేశారు. ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్‍లకు తలైవా హాజరవుతారని తెలిపేందుకు సంతోషిస్తున్నాం. ప్రత్యేక అతిథిగా ఆయన ప్రపంచకప్‍కు హాజరవనున్నారు. తద్వారా అతిపెద్ద క్రికెట్ వేడుకను మరింత గ్రాండ్‍గా చేయనున్నారు” అని ట్వీట్ చేసింది. దీనికి రజినీకి జై షా గోల్డెన్ టికెట్‍ అందిస్తున్న ఫొటోలు జత చేసింది.

గోల్డెన్ టికెట్ ప్రత్యేకత ఏంటంటే..?

2023 వన్డే ప్రపంచకప్‍లో భాగంగా జరిగే ఏ మ్యాచ్‍నైనా స్టేడియంలోని ప్రత్యేక వీఐపీ బాక్సు నుంచి ఉచితంగా వీక్షించవచ్చు. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‍లకు ఈ సదుపాయం ఉంటుంది. అలాగే మ్యాచ్ వీక్షించే సమయంలో వారికి వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తుంది. ఇక ఇప్పటి వరకు ఈ గోల్డెన్ టికెట్ అందుకున్నవారిలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‍ఉన్నారు. తాజాగా వీరి సరసన రజినీకాంత్ కూడా చేరారు. అంతేకాకుండా దక్షిణాది నుంచి 2023 ప్రపంచకప్ గోల్డెన్ టికెట్ అందుకున్న తొలి సెలెబ్రిటీ ఆయనే కావడం విశేషం.

కాగా రజినీకాంత్‍కు క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్న విషయం బహుశా కొద్దిమందికే తెలిసిఉండవచ్చు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో కూడా ముంబైలో జరిగిన ఫైనల్‍కు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో 28 సంవత్సరాల తర్వాత టీమిండియా ప్రపంచకప్‍ను గెలుపొందగా ఆయన ప్రత్యక్షంగా ఆ మ్యాచ్ చూసి పరవశించిపోయారు. ఇక ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ వరకు జరగనుంది. రజినీ ప్రత్యక్షంగా హాజరవనున్న నేపథ్యంలో.. మరోసారి 2011 ప్రపంచకప్ సెంటిమెంట్ నిజమవ్వాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా ఇటీవలే రజినీకాంత్‍ నటించిన ‘జైలర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినాయకన్, రమ్య కృష్ణన్, వసంత్ రవి మరియు తమన్నా భాటియా కూడా కీలక పాత్రలు పోషించారు. కాగా ‘జైలర్‌’ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ మరియు బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ క్యామియో రోల్స్ లో కనిపించడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =