బిగ్ బాస్ హోస్ లో 12 రోజులు పూర్తయిపోయాయి. ప్రస్తుతం రెండో వారం పవరాస్త్ర కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగాన మాయస్త్ర గెలుచుకునే పోటీ పెట్టాడు. దీనికోసం రణధీర, మహాబలి అనే రెండు టీమ్ లుగా హోస్ మేట్స్ ను డివైడ్ చేశాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో రణధీర టీమ్ అయిన శివాజీ, అమర్ దీప్, ప్రిన్స్, శోభా శెట్టి, ప్రియాంక, షకీలా గెలిచి మాయస్త్రను గెలుచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. రణధీర టీమ్ లో పవరాస్త్రను గెలుచుకోవడానికి ఎవరు అర్హులో తెలపాలని మహాబలి టీమ్ చేతిలో పెట్టాడు. దీంతో మహాబలి టీమ్ వారి వారి ప్లానింగ్ లతో వచ్చేశాడు. ఇక మొన్న రతిక రచ్చతో ముగిసిన ఎపిసోడ్ నిన్న అక్కడినుండే మొదలైంది. ఎంతసేపటికీ మహాబలి టీమ్ నుండి ఎవరూ రాకపోవడంతో రణధీర టీమ్ మెంబర్స్ నే సెలక్ట్ చేసుకోమని చెబుతాడు. దీనివల్ల ప్రియాంక, అమర్ దీప్, శోభాశెట్టి గేమ్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
ఎపిసోడ్ స్టార్టింగ్ గౌతమ్ వచ్చి ప్రిన్స్ అనర్హుడు అంటూ మాయాస్త్రలో భాగాన్ని తీసుకొని శివాజీకి ఇస్తాడు. శివాజీనే టీమ్ ను లీడ్ చేసినట్టు ఉందని చెప్పాడు. దీంతో కరెక్ట్ రీజన్ చెప్పమని గౌతమ్ ను అడుగుతాడు. ఇక ఇక్కడ ఇద్దరికీ పెద్ద గొడవనే జరుగుతుంది. అంతేకాదు ఒకరిపై ఒకరు వెళ్లేంత రేంజ్ కు వెళతారు ఇద్దరూ. ఇక్కడే ప్రిన్స్ తన బాడీ చూపిస్తుండగా.. గౌతమ్ ఇంజెక్షన్ అంటూ సైగ చేస్తాడు. దీంతో ట్రిగర్ అయిన ప్రిన్స్ గట్టిగా అరిచేస్తాడు. పర్సనల్ గా వెళ్లొద్దూ.. నువ్వు చూశావా.. ఇది అన్యాయం అంటూ.. నేను వెళ్లిపోతా బిగ్ బాస్ అంటూ ఏడ్చేస్తాడు. దీంతో ప్రిన్స్ ను ఓదార్చుతారు మిగిలిన కంటెస్టెంట్స్. నేను డాక్టర్ ను నాకు తెలియదా అంటూ మరోపక్క గౌతమ్ అంటాడు. ఫైనల్ గా అందరూ కన్వీన్స్ చేయడంతో మాయాస్త్ర భాగాన్ని గౌతమ్ కు ఇస్తాడు. దీంతో శివాజీ, షకీలా ఫైనల్ గా పోటీకి నిలుస్తారు.
మరి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వకుండా బిగ్ బాస్ సైలెంట్ గా ఉండడు కదా. సంచాలకుడిగా ఉన్న సందీప్ కు ఒక ఛాన్స్ ఇచ్చి మరో కంటెస్టెంట్ ను ఎన్నుకోమని చెబుతాడు. సందీప్ అమర్ దీప్ ను మూడో కంటెస్టెంట్ కోసం ఎన్నుకుంటాడు. మరోవైపు బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కు శివాజీ కాస్త డిజప్పాయింట్ అవుతాడు. అంతేకాదు సందీప్ అమర్ దీప్ ను ఎన్నుకోవడంతో గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అంటాడు. చివరిగా వీరి ముగ్గురికి ఒక టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అని బిగ్ బాస్ చెవిలో ఎవరు గట్టిగా అరుస్తారో వారికి ఈవారం పవరాస్త్ర రానుంది. ఇక ముగ్గురు గట్టిగానే అరుస్తారు. అయితే రిజల్ట్ మాత్రం వీకెండ్ లో నాగార్జున గారు చెబుతారని మరో మెలిక పెట్టాడు. మరి ఈవారం పవరాస్త్రను ఎవరు గెలుచుకున్నారో తెలయాలంటే వీకెండ్ వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























