హాయ్ నాన్న నుండి సోల్ ఫుల్ సమయమా ఫుల్ సాంగ్ రిలీజ్

samayama full song released from hi nanna movie

న్యాచురల్ స్టార్ నాని మాత్రం తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే దసరా సినిమాతో వచ్చాడు. ఇక దసరాలో ఊర మాస్ లుక్ తో నటనతో అదరగొట్టిన నాని ఇప్పుడు మళ్లీ తన పాత జోనర్ లోకి వచ్చేశాడు. ఈసినిమా తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి.. ఇప్పటికే తండ్రి పాత్రలో నాని ఏ రేంజ్ లో నటిస్తాడో జెర్సీ సినిమాలో చూపిస్తాడు కాబట్టి ఈసినిమాలో కూడా ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సమయమా అంటూ వచ్చే ఈ ఫస్ట్ సాంగ్ ప్రోమోను నిన్న రిలీజ్ చేయగా ప్రోమోకే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈపాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణకుమార్ పాడారు. ఇక మంచి సోల్ ఫుల్ బీట్ తో ఉన్న ఈపాట అయితే ఆకట్టుకుంటుంది. ఈ పాట హిట్ గా నిలవడం ఖాయం అంటున్నారు. ఎలాగైతే ఖుషి సినిమాకు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.. ఈపాటతో ఈసినిమాకు కూడా అలాంటి పాటలే అందిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.వి.మోహ‌న్‌, డాక్ట‌ర్ విజేందర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈసినిమాను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 18 =