మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పై రామ్ చరణ్ రివ్యూ

Ram Charan Reviews Miss Shetty Mr Polishetty Movie

టాలీవుడ్ యంగ్ హీరో, ‘జాతిరత్నాలు’ ఫేమ్ న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు.. మహేష్‌, రాజ‌మౌళి, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ లిస్టులో చేరారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా దీనిపై ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను ఇప్పుడే చూశాను. చాలా నచ్చింది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ మరియు అనుష్క శెట్టి అందం కలగలిసిన కాంబో అద్భుతంగా కుదిరింది. దర్శకుడు మహేష్ మరియు యూవీ క్రియేషన్స్ వారికి అభినందనలు” అని పేర్కొన్నారు.

అయితే ఈ చిత్రం విడుదలకు ముందే రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి నుంచి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి ప్రశంసలు లభించాయి. చిత్ర యూనిట్ ఆయన కోసం ప్రత్యేకంగా స్పెషల్ షో వేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడిని తానేనన్న చిరంజీవి.. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్‌ను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ అనుష్క నటనను అప్రిషియేట్ చేసిన మెగాస్టార్.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేశారంటూ యూవీ క్రియేషన్స్ విక్కీ, డైరెక్టర్ పి.మహేశ్ బాబును అభినందించారు.

కాగా ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ, మురళీ శర్మ, తులసి, అభినవ్ గోమటం, సోనియా దీప్తి తదితరులు నటించారు. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్‌ టాక్‌తో విడుదలైన అన్ని సెంటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం కాసులు కురిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్‌ (అమెరికా)లో డాలర్ల వర్షం కురిపిస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ మూవీ యూఎస్‌లో ($1.4K+) రూ.11కోట్ల 63 లక్షలకి పైగా రాబట్టి.. 2 మిలియన్ డాలర్స్ దిశగా పరుగులు తీస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 8 =