డబుల్ ఇస్మార్ట్ కోసం సంజూభాయ్?

bollywood actor sanjay dutt in ram double ismart movie

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్.
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు మేకర్స్. షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా గురించి ఇప్పుడు ఒక ఇట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు సంజయ్ దత్. సంజయ్ దత్ ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఇప్పటికే సంజయ్ దత్ కె.జి.యఫ్ 2 లో నటించాడు.. ఇప్పుడు విజయ్ హీరోగా వస్తున్న లియో సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

కాగా ఈసినిమాను పూరి కనెక్ట్స్‌ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =